Breaking News

బ్రతుకు జట్కాబండి ..!

కలెక్టర్ మేడం కనికరించండి @ రేఖమ్మ మొర

బ్రతుకు జట్కాబండి ..!

 

కర్నూల్ (సి క్యాంప్ రైతు బజార్) మెట్రో ఉదయం , 10 డిసెంబర్ 2023 :

కర్నూల్ నగరంలోని శ్రీరామ కాలనీలో నివాసం ఉంటున్న వీరేష్ బార్య రేఖ కుటుంబం కూరగాయల వ్యాపారం పైన ఆధారపడి జీవిస్తున్నారు. కూరగాయల వ్యాపారమే కుటుంబ పోషణగా బ్రతుకు జట్కా బండి లాగిస్తున్నారు. వీరికి ఇద్దరు సంతానం. పిల్లల సంరక్షణ తో పాటు చదువులు కుటుంబ పోషణ రోజు రోజుకు భారమవుతున్న నేపథ్యంలో సి క్యాంపు రైతు బజార్ లోని కూరగాయల వ్యాపారాన్ని ప్రారంభించారు. బ్రతుకు భారమవుతూ కుటుంబ పోషణ ఇబ్బందిగా మారే సమయంలో చితికి పోతుందన్న కుటుంబానికి కూరగాయల అంగడి ఖాళీగా ఉందని తెలియడంతో సొంత అంగడి శాశ్వతంగా అంది వస్తుందని అధికారులు సాయం అందిస్తారని ఆశలు చిగురించాయి .

గత 18 సంవత్సరాలుగా పొదుపు లక్ష్మి గ్రూపులో కొనసాగుతున్న రేఖ 8 సంవత్సరాల నుండి కూరగాయల వ్యాపారం వృత్తి తోనే కుటుంబ బారం మోస్తున్నారు. అయితే ఖాళీగా ఉన్న అంగడి కోసం పొదుపు లక్ష్మి గ్రూప్ తరఫున శాశ్విత అంగడిని కేటాయించాలని సంబంధిత శాఖ అధికారులతోపాటు కర్నూలు జిల్లా కలెక్టర్ కు దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయానికి జగనన్నకు చెబుదాం అనే కార్యక్రమానికి కూడా తమ గోడును బాధను తెలియజేశారు. ఈ సందర్భంగా మెట్రో ఉదయం ప్రతినిధితో కూరగాయల వ్యాపారి రేఖ కుటుంబ సభ్యులు మాట్లాడుతూ సానుకూల స్పందన ఉందని అయితే వీలైనంత త్వరగా తమకు శాశ్విత కూరగాయల అంగడిని సి క్యాంపు రైతు బజార్లో కేటాయిస్తే కుటుంబ పోషణ కాస్త మెరుగుపడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. రేఖ భర్త వీరేశ్ అనారోగ్యం తో బాధపడుతున్నారని పిల్లల సంరక్షణ రోజురోజుకు భారమవుతుందని కుటుంబ పరిస్థితి అయోమయంలో పడిపోయే ప్రమాదం ఉందని కలెక్టర్ వెంటనే స్పందించి తమకు అంగడిని కేటాయిస్తే కుటుంబంలో వెలుగులు నింపిన వారవుతారని ఆరిపోయే దీపాన్ని వెలిగించిన వారవుతారు అన్నారు. తమ దరఖాస్తు ను వెంటనే పరిశీలించాలని తమ కుటుంబానికి ఆసరా కల్పించి ఆదుకోవాలని కూరగాయల వ్యాపారి రేఖ కర్నూలు జిల్లా కలెక్టర్ సృజన ను కోరారు.

Leave A Reply

Your email address will not be published.