న్యాయమూర్తులకు ఘన సన్మానం
కర్నూల్
కర్నూల్ జిల్లా న్యాయవాదుల సంఘం కార్యాలయం నందు న్యాయమూర్తులకు ఘన సన్మానం జరిగింది. న్యాయమూర్తులుగా విధులు నిర్వహిస్తున్న ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి బాబా ఫక్రుద్దీన్ కడప జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి లోక్ అదాలత్ న్యాయ మూర్తిగా , ఎక్సైజ్ కోర్టు న్యాయమూర్తి పఠాన్ సియాజ్ ఖాన్ నర్సీపట్నం సబ్ జడ్జ్ గా పదోన్నతులపై వెళ్తున్న నేపథ్యంలో కర్నూల్ జిల్లా న్యాయవాదుల సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు నాగభూషణం నాయుడు చక్రపాణిల ఆధ్వర్యంలో పూలమాలలు శాలువల తో ఘనంగా సత్కరించి ఘన సన్మానం చేశారు. ఈ సందర్భంగా న్యాయమూర్తులు న్యాయవాదులు వారి సేవలను కొనియాడారు. కర్నూలు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎన్ శ్రీనివాసరావు పదోన్నతి పై వెళ్తున్న న్యాయమూర్తులను ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అనతి కాలంలోనే పదోన్నతి పొందడం వారి కృషి కి నిదర్శనం అని ఇంకా ఉన్నత పదవులను అధిరోహించాలని కర్నూల్ నుండి వెళ్లడం ఎంతో గర్వంగా ఉందన్నారు. వారిరువురూ ఎంతో స్నేహభావంతో మెలిగారన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు భూపాల్ రెడ్డి న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సిహెచ్ వెంకట నాగ శ్రీనివాసరావు దివాకర్ జోష్ణ దేవి కళ్యాణి, స్టేట్ బార్ కౌన్సిల్ మెంబర్ రవి గువేర , న్యాయవాదులు, కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.