Breaking News

శ్రీపతీ! నీకోచిరు గీత మాలిక!

శ్రీపతీ! నీకోచిరు గీత మాలిక!
ఏపాటలు పాడగలమో గదా! బాలూ…
నీవు పొడి మమ్మలరించిన నీరాగమాలికలు తప్ప
ఏబిరుదులు నీకందివ్వగలమోగదా బాలూ
మనసులోపల దాచిన మమతల మాలలు తప్ప-
మురిపాల అలరించు గీతమా! తలపులా!
పాటలు దరహాస చండ్రికలా!
నీవులేని ఈ పాటలు నిట్టూర్పుల సెగల పొగలు
నీవు
లేని ఈ జగతి నిర్మానుష్యపు కారడవి
పాటెందుకు? పదమెందుకు?
నీవు లేక స్వర మెందుకు?
భాషెందుకు? భావమెందుకు? నీవు లేని పాటెందుకు?
తలపెందుకు? మనసెందుకు?
నీవు లేని ఈ స్వరాభిషేకమ్ములెందుకు?
మబ్బులతో ఒకసారి మనవి చేసికొందును –
నీ సంగీత మాలికలే జగతిపై శ్రావణమేఘాలై కురియాలనీ
చుక్కలతో ఒకసారి వినతి చేసికొందును –
నీపాటలే చుక్కలై నింగిలో మెరిసిపోవాలనీ!
దివిని వెలసిన గాన గంధర్వులను వేడుకుందును ఇలా!
మాగాన గంధర్వుడి పాటలే
జగతిలోసజీవమ్ముగా నిలిచిపోవాలనీ!
ఆ స్వరరాగ సరస్వతి ముందు చేతులెత్తి ప్రార్థింతును తుదిసారిగా
ఆస్వరరాగమూర్తియే తిరిగిరావాలనీ!
దివికేగిన ‘బాలుడే’ మరల జన్మించాలనీ!

V.S. రాజ్యలక్ష్మి
పెరుందురై- (T.N)
9190549420
25-09-2023

Leave A Reply

Your email address will not be published.