Breaking News

మానవహక్కుల పరిరక్షనే ప్రధానధ్యేయం..!

మానవహక్కుల పరిరక్షణకు పాటుపడాలి

కర్నూల్ ( మెట్రో ఉదయం):
అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా కర్నూలు లోని అంబేత్కర్ విగ్రహం దగ్గర న్యాయవాదులు ప్రజాసంఘాలు వారు పాల్గోని ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాలు మానవ హక్కులు కాపాడటంలో నిర్లక్ష్యం వహిస్తూ మహిళలు, పిల్లలు వృద్దులు అని చూడకుండా హింసిస్తూ చంపేస్తున్నారు. యుద్దాలు ఎక్కడ జరిగిన సామాన్య ప్రజలు బలైతున్నారని ఇలాంటివి ఎక్కడ జరిగిన మానవ హక్కులు ఉల్లంఘించిన వారౌతారని , తక్షణమే ప్రపంచ దేశాలు మానవ హక్కుల పరరక్షణకై పాటుపడాలని లేని యెడల మానవ జాతి మనుగడ ప్రశ్నార్ధకం గా మారుతుంది అని తెలిపారు. అలాగే ప్రజావ్యతిరేక చట్టాల నిర్మూలన కై ప్రతి ఒక్కరి చేయి, చేయి కలిపి ఉద్యమించాలని, ఆంధ్ర ప్రదేశ్ లో రైతులకు వ్యతిరేకంగా తెచ్చిన లాండ్ టైటిల్ ఆక్ట్ చట్టాన్ని ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మహిళా న్యాయవాది తేజోవతి, ఓంకార్, ఎమ్మార్ కృష్ణ , ఓపిడిఆర్ జిల్లా అధ్యక్షులు సీనియర్ న్యాయవాదులు కర్ణాకర్, కార్యదర్శి ఆర్ నరసింహులు, షాబుదిన్, బాబుసాహెబ్, మా భాష, ఖాదర్ బాషా, బద్దల్ లక్ష్మీనారాయణ , మదన్ రెడ్డి,, నాగన్న , ప్రజానాయకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.