Breaking News

రద్దుకు జిద్దు

జిఓ రద్దు కు జిద్దు … సై అంటున్న న్యాయవాదులు

న్యాయవాదుల రిలే నిరాహార దీక్షలు

కర్నూల్, లీగల్ కరస్పాండెంట్,
డిసెంబర్ 11, 2023 (మెట్రో ఉదయం): కర్నూల్ జిల్లా న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో నగరంలోని శ్రీకృష్ణదేవరాయ విగ్రహం దగ్గర రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. ఏపీ భూ హక్కుల చట్టం 2022 , జీవో 512 ను ఉపసంహరించుకోవాలని న్యాయవాదులు గత కొద్ది రోజులుగా నిరసనలు చేస్తున్న విషయం విధితమే.. సమస్య పరిష్కారం కానందున జీవో రద్దు చేసేంతవరకు పోరాడుతాం అంటూ న్యాయవాదులు దీక్ష శిబిరం ప్రారంభించి జీఓ రద్దు కు జిద్దు గా భీష్మించుకు కూర్చున్నారు. మొదటిరోజు దీక్షశిపురంలో రిలే నిరాహార దీక్షలో న్యాయవాదుల సంఘం ప్రధాన కార్యదర్శి సీనియర్ న్యాయవాది బాబు సాహెబ్ , ఆర్ నరసింహులు , శ్రీనివాసులు , సోమశేఖర్ గౌడ్ , ఎం వెంకటేశ్వర్లు , ఆంజనేయులు, రవికుమార్ , ఆసిఫ్ హుస్సేన్ న్యాయవాదులు పాల్గొన్నారు.
దీక్షా శిబిరంలో కూర్చున్న న్యాయవాదులకు న్యాయవాది సీనియర్ జర్నలిస్టు బద్దల్ లక్ష్మీనారాయణ పూలమాలలు వేశారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదుల సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు నాగభూషణం నాయుడు చక్రపాణి, స్టేట్ బార్ కౌన్సిల్ మెంబర్ రవి గువేర, సీనియర్ జూనియర్ న్యాయవాదులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.