Breaking News

లోక్ అదాలత్ ను సందర్శించిన సభ్య కార్యదర్శి భబిత 

ఏపి ఉన్నత న్యాయస్థానాల ఆదేశాల మేరకు ఉమ్మడి కర్నూల్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయాన్ని రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ సభ్య కార్యదర్శి ఎం భబిత శనివారం సందర్శించారు. తనిఖీలో భాగంగా రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా కర్నూలు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎన్ శ్రీనివాసరావు న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సిహెచ్ విఎన్ శ్రీనివాసరావు లను

కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్యానల్ న్యాయవాదులతో మాట్లాడారు. కేసుల సత్వర పరిష్కారానికి సహకరిస్తున్న కర్నూలు జిల్లా ఎస్పీ కృష్ణ కాంత్ ను అభినందించారు. న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి సిహెచ్ వెంకట నాగ శ్రీనివాసరావు

సేవలపై సంతృప్తి వ్యక్తం చేశారు. కర్నూలు జిల్లా ప్రధాన న్యాయమూర్తి న్యాయ సేవ అధికార సంస్థ చైర్మన్ ఎన్ శ్రీనివాసరావును పరిపాలన విభాగంలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారన్నారు. ప్రధాన న్యాయమూర్తి ఎన్ శ్రీనివాసరావు తో కలిసి సభ్య కార్యదర్శి భబిత కోర్టు ఆవరణంలో మొక్కలను నాటారు. అనంతరం జిల్లా సబ్ జైల్లో ఉన్న ఖైదీలకు అత్యవసర పరిస్థితులలో ఉపయోగించుకోవడానికి వీల్ చైర్స్ ను సభ్య కార్యదర్శి భబిత చేతుల మీదుగా జిల్లా జైల్ పర్యవేక్షణ అధికారికి అందజేశారు. తనిఖీ నేపథ్యంలో న్యాయ సేవ అధికార సంస్థ ఉమ్మడి జిల్లాల సిబ్బంది హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు భూపాల్ రెడ్డి మల్లేశ్వరి దివాకర్ జోష్ణ దేవి కళ్యాణి వందన , బాల నేరస్తుల వసతి గృహ పర్యవేక్షణ అధికారి హుస్సేన్ భాష ఆయా శాఖల జిల్లా స్థాయి ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.