Breaking News

కార్తీక మాసంలో దీపం వెలిగిస్తే ఎంతో పుణ్యం

కార్తీక మాసంలో దీపం వెలిగిస్తే ఎంతో పుణ్యం… యోగా గురువు పెరుమాళ్ల దత్తయ్య…

కార్థిక మాసం సందర్భంగా కర్నూలు లో దేవాలయాలు భక్తులతో నిండిపోయాయి. నగరంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఆవరణలో సాయి పతాంజలి శిక్షణ యోగ కేంద్రం ఆధ్వర్యంలో మహిళలు పెద్ద ఎత్తున కార్తిక దీపోత్సవం నిర్వహించారు. ద్వాదశ జోతిర్లింగాలను ఏర్పాటు చేసి మహిళలు ప్రత్యేకంగా దీపాలను వెలిగించారు. కార్తీక మాసంలో ఒక్క దీపం వెలిగించిన ఎంతో పుణ్యం వస్తుందని యోగ శిక్షణా కేంద్రం గురువులు పేరుమాళ్ల దత్తాత్రేయ తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళల పెద్ద ఎత్తున పాల్గొని కార్తీక దీపాలు వెలిగించారు. సామూహికంగా పెద్ద సంఖ్య లో దీపాలు వెలిగించడం ఎంతో సంతోషంగా ఉందని యోగా శిక్షణ కేంద్రం కార్యదర్శి రేవూరు
బాలకృష్ణ తెలిపారు. బ్రామరాంభ, ఉమ, ప్రత్యూష ద్వాదశ జోతిర్లింగాలను అలంకరించారు.

Leave A Reply

Your email address will not be published.