జాతీయా అక్షరాస్యతా దినోత్సవాన్ని కర్నూలు లో ఘనంగా నిర్వహించారు. భాష్యం బాలాజీ నగర్ పాఠశాలకు చెందిన విద్యార్థులు స్థానిక విశాల్ మెగా మార్ట్ ముందు ఫ్లాష్ మాంబ్ నిర్వహించారు. విద్యార్థులు అక్షరస్యత పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పలువురిని ప్రశ్నలడిగి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడం వెనుక పాఠశాల చైర్మన్ రామకృష్ణ, సిఇఓ అనిల్ కుమార్ ప్రోత్సాహంతో పాటు పాఠశాల అధ్యాపక బృందం సహకారం, విద్యార్థుల ఆసక్తి ఎంతైనా ఉందని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కుసుమ గారు తెలియచేశారు. అక్షరాస్యత పై అవగాహన కల్పించే కార్యక్రమం నిర్వహించడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేపట్టాలని వారు కోరారు. ఈకార్యక్రమంలో హెచ్.యం. సఖ్యత పాల్గొన్నారు.