Breaking News

న్యాయమూర్తులకు వర్క్ షాప్

న్యాయమూర్తులకు వర్క్ షాప్

కర్నూల్ (లీగల్ కరస్పాండెంట్) మెట్రో ఉదయం :
ఉన్నత న్యాయస్థానాల ఆదేశాల మేరకు కర్నూల్ జిల్లా కోర్టులో న్యాయమూర్తులకు వర్క్ షాప్ నిర్వహించారు. ఏపీ హైకోర్టు పోర్ట్ పోలియో న్యాయమూర్తి జస్టిస్ బి కృష్ణమోహన్ నేతృత్వంలో నోడల్ అధికారి కర్నూలు జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిర్వహించిన వర్క్ షాప్ లో ప్రధాన వక్తలుగా ఏ పి హెచ్ ఆర్ సి చైర్మన్ సీతారామ మూర్తి , విశ్రాంతి జిల్లా ప్రధాన న్యాయమూర్తి లక్ష్మి నరసింహారెడ్డి లు సివిల్ కేసులలో డాక్యుమెంటరీ ఎవిడెన్స్ గురించి క్షుణ్ణంగా వివరించారు. న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సిహెచ్ వెంకట నాగ శ్రీనివాసరావు చక్కటి మానిటరింగ్ చేసి ఉత్తమ కోఆర్డినేటర్ గా జస్టీస్ కృష్ణ మోహన్ తో శబాష్ అనిపించుకున్నారు.


ఈ కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా ఉన్న న్యాయమూర్తులు అందరూ హాజరయ్యారు.

Leave A Reply

Your email address will not be published.