**************
☆ఎటు పోయిందో నా చిరునవ్వు☆
**************
(ఉదయం మహిళోదయం)
బతుకు బరువైన జీవితంలో
నా చిరునవ్వు ఎక్కడో తప్పిపోయింది
చాదస్తపు కట్టుబాట్లను దాటలేక
నా చిరునవ్వు ఎక్కడో బందీ అయిపోయింది
బంధం పేరుతో బాధిస్తున్న మనుషులను భరిస్తూ
నా చిరునవ్వు ఎక్కడో చితికిపోయింది
అడుగడుగునా అణిచివేయాలని చూసే మనుషుల మధ్య
నా చిరునవ్వు ఎక్కడో ఛీద్రమైపోయింది
ఎదురీతలో ఎదగాలనుకునే కళ్ళ కన్నీళ్ళలో
నా చిరునవ్వు ఎక్కడో మునిగిపోయింది
విజయం వెనుక అపజయాల బాధను చూడని అపహేళనలో
నా చిరునవ్వు ఎక్కడో మసకబారుతుంది
పడిపోయే సమయంలో అభయాన్నిచ్చిన హస్తానికై
నా చిరునవ్వు ఇప్పుడే చిగురిస్తుంది
లహరి మహేంధర్ గౌడ్
ఆదిలాబాద్